జూబ్లీహిల్స్ లో గురువారం మధ్యాహ్నం పట్టపగలు దారి దోపిడీ జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తితో బెదిరించారు. ద్విచక్ర వాహనంతో పాటు అతని వద్ద ఉన్న పర్సు, రెండు ఫోన్లు లాక్కుని పరారయ్యారు. దుండగులతో తీవ్రంగా ప్రతిఘటించిన బాధితుడు హెల్మెట్ విసిరికొట్టినా వదలకుండా ముగ్గురూ ద్విచక్రవాహనంపై అక్కడినుంచి ఉడాయించారు. సమీపంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

 

ఈ దొంగతనం ఎలా జరిగిందో కింది వీడియోలో చూడండి