Asianet News TeluguAsianet News Telugu

4జీ జియో ఫోన్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే ఇది గమనించండి

  • వాట్స్‌ప్ ఇన్‌స్టాల్ అవ్వ‌దు.
  • ప్రత్కేక చాటింగ్ యాప్
  • జియో యూజర్ల కు మాత్రమే ప్రత్కేకం
jio 4G handset does not support watts app

జియో ఫోన్ ఫ్రీగా 4జీ హ్యాండ్ సెట్ ను ఇస్తుంది. కానీ 1500 రూపాయ‌ల‌ను డిపాజిట్ కింద జ‌మ‌చేసుకుంటుంది. తిరిగి 36 నేల‌ల త‌రువాత ఇస్తుంది.  ఫోన్ కి సంబంధించిన సేల్ కూడా ఆగ‌ష్టు 24 తేదీన బుకింగ్ ప్ర‌రంభం కానుంది. సెప్టేంబ‌ర్ మొద‌టి వారం నుండి బుక్ చేసుకున్న క‌ష్ట‌మ‌ర్ల‌కు ఫోన్ల ను అందిస్తారు.


అందులో ఉన్న ఫీచ‌ర్ల పైన ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతుంది.
ఫ్రీగా ఫోన్ అంటే ఎవ‌రైనా సుముఖ‌త చూపుతారు ఇప్పుడు జియో ఫోన్ పై చాలా మంది కొన‌డానికి సిద్ద‌మయ్యారు. కానీ అందులో ఉన్న ఫీచ‌ర్లు ఏమున్నాయి అనేది మాత్రం మ‌రిచిపోతున్నారు.

4జీ ఫోన్ లో ఉన్న ఫీచ‌ర్లు.

* కేవ‌లం జియో సిమ్ మాత్ర‌మే ప‌ని చేస్తుంది.
* 4జీ స‌పోర్టు.
* 3జీ&2జీ స‌పోర్టు.
* ఇంట‌ర్నేట్ కాల్స్ మాత్ర‌మే.
* సాధార‌ణ ఎస్ఎమ్ఎస్‌లు సౌక‌ర్యం.
* ప్రాంతీయ భాష‌లు.

4జీ ఫోన్ లో లేని ఫీచ‌ర్లు.

* వాట్స్‌ప్ ఇన్‌స్టాల్ అవ్వ‌దు.
*హాట్స్‌స్పాట్ ఆప్ష‌న్ లేదు.
*ఇంట‌ర్ నెట్ లేకుండా కాల్స్ పోవు.
*ప్ర‌త్కేక ఫేస్ బుక్ యాప్ కూడా ఇన్‌స్టాల్ అవ్వ‌దు. 

 ఎస్ఎమ్ఎస్ ల‌ కాలం పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వాట్స్‌యాప్, కోట్లాది మంది యూజ‌ర్లు ఇందులో ఉన్నారు.
కానీ 4జీ జియో ఫోన్ లో వాట్స్‌యాప్ లేదు. జియో ఫోన్ లో ప్ర‌త్కేకమైన చాటింగ్ యాప్ ను తీసుకొస్తున్నారు. ఆ యాప్ కేవ‌లం జియో క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ప‌ని చేస్తుంది. ఇత‌ర క‌స్ట‌మ‌ర్ల‌కు జియో అందించే చాటింగ్ యాప్ ప‌ని చేయ్య‌దు.

Follow Us:
Download App:
  • android
  • ios