హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్యూటిక్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. కంపెనీలో అనూహ్యంగా భారీ శబ్దంతో పేలుడు జరిగి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొదట కొందరు కార్మికులను కాపాడారు.  మొత్తం ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో మంటల్ని అదుచేశారు. ఇంకా కొందరు కార్మికులు మంటల్లోనే చిక్కుకుని ఉన్నట్లు సమాచారం.

ఈ మంటలతో కంపెనీలోని కెమికల్స్ కలిసిపోయి దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీగా పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు.

 

వీడియో