జడ్చర్ల లో రోడ్డు ప్రమాదం ఐదుగురి మృతి

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో బయలుదేరిన ఆటోను లారీ ఢీ కొట్టడంతో 5 గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్ర గాయాలవగా సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటో తుక్కుతుక్కుగా మారింది. ఆటోలో కొన్ని శవాలు చిక్కుకుని వున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.