స్వామి ఆయంలో ఇనుప మెట్లు నిర్మిస్తున్నారు. వెండి వాకిలి ముందు భాగంలో ఈ పనులు జరుగుతున్నాయి.
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయంలో ఇనుప మెట్లు నిర్మిస్తున్నారు. వెండి వాకిలి లోపలి భాగంలో , యోగ నరసింహస్వామి ఆలయానికి ఆగ్నేయం వైపు ఈ మెట్ల నిర్మాణాన్ని చేపట్టారు. టిటిడి ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీవారి హుండీ నుంచి వెలుపలికి వచ్చే మార్గంలో.. వెండి వాకిలి ముందు భాగంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారానికి తగలకుండా ఈ నిర్మాణం చేపట్టారు.
యోగ నరసింహస్వామి ఆలయ ప్రదక్షిణంగా వెళ్లే సమయంలో అక్కడే మెట్లు ఎక్కి వెండి వాకిలి గోపురానికి ఉత్తర వైపుగా అన్నప్రసాదాల వితరణ ప్రాంతంలో దిగే విధంగా ఈ మెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజుతో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ మెట్ల ద్వారా భక్తులకు ఇబ్బంది కలగకుండా సులభంగా పంపవచ్చని టిటిడీ అధికారులు తెలిపారు.
కాగా.. శ్రీవారి మూల విరాట్ కంటే ఎత్తైన భాగంలో భక్తులు నడిచి వెళ్లడం ఆగమనానికి విరుద్ధ మంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఆగమ సలహా మేరకే మెట్ల నిర్మాణం చేపట్టినట్లు టిటిడీ అధికారులు చెబుతున్నారు.
