సెల్పీ వీడియో రికార్డు చేసి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

intermediate student suicide at warangal
Highlights

  • వరంగల్ పట్టణంలో విషాదం
  • ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ అమ్మాయి

వరంగల్ గిర్మాజి పల్లి దారుణం చోటుచేసుకుంది. పరిక్షా ఫలితాల భయంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకపోతున్నందుకు తనకు తానుగా ఈ శిక్ష వేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోలో రికార్డు చేసేకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  

వరంగల్‌ పట్టణంలోని చార్‌బౌళి ప్రాంతంలో శనిగరం సతీష్‌ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చందన ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది. అయితే ఈ పరీక్షలు బాగారాయలేకపోడంతో పరీక్షలు ముగిసినప్పటి నుండి చందన దిగాలుగా ఉంటోంది. ఈ క్రమంలో తెలిసిన వారింట్లో పంక్షన్ ఉండటంతో చందన తల్లిదండ్రులు, చెల్లెలు వర్ష వెళ్లారు. దీంతో ఇంట్లో ఒంటరిగా వున్న చందన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన సెల్ ఫోన్ లో ఓ సెల్పీ వీడియో రికాన్డ్ చేసింది. ఈ వీడియోలో చందన ''సారీ మమ్మి... సారీ డాడి... మీ ఆశలు నెరవెర్చలేక పోతున్నా...అందుకే చనిపోతున్నా.. మమ్మి ఐ మిస్‌ యు.. డాడీ ఐ మీస్‌ యు.. వర్ష ఐ మీస్‌ యు'' అంటూ రికార్డు చేసింది.  

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  ఈ ఆత్మహత్యకు ఒత్తిడే కారణమా, లేదా మరేదైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

loader