కుప్పకూలిన వైమానిక దళ హెలికాప్టర్ప్రమాదంలో ఐదుగురి మృతివిచారణకు ఆదేశించిన ఐఏఎఫ్ అధికారులు

భారత వైమానిక దళానికి చెందిన ఓ ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు వ్యక్తులు మరణించారు. వివరాల్లోకి వెళితే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద పైలట్లకు శిక్షణ ఇచ్చే విమానం ఒకటి సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగినపుడు విమానంలో ఏడుగురు వ్యక్తులు ఉండగా అందులో ఐదుగురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ ఉదయం ఎయిర్ మెయింటెనెన్స్ మిషన్ నిర్వహిస్తుండగా హఠాత్తుగా ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో ఉన్నవారు తప్పించుకునే సమయం లేకుండా రెప్పపాటులో ప్రమాదం జరిగింది. ఇండో చైనా సరిహద్దులో జరిగిన ఈ ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. ఈ మద్య కాలంలో వైమానిక హెలికాప్టర్ లు ప్రమాదానికి గురవుతుండటంతో వీటిపై సీరియస్ గా విచారణ జరిపించనున్నట్లు ఐఏఎప్ అధికారులు ఉన్నతాధికారులు తెలిపారు.