భారత్ మూడో వన్డేలో విజయం ఐదు మ్యాచ్ లలో 3-0 తో సిరీస్ కైవసం. 5 వికెట్లతో లంకను కట్టడి చేసిన బూమ్రా. సెంచరీతో అదరగొట్టిన రోహిత్. అర్థ సెంచరీతో రాణించిన ధోనీ.
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి టార్గెట్ ను చేరుకుంది. మొదటి నుండి వికెట్లు కోల్పోతున్న ఓపెనర్ రోహిత్‌శర్మ శతకంతో ఆకట్టుకున్నాడు, మహేంద్ర సింగ్ ధోనీ అర్థ శతకంతో ఆకట్టున్నారు. 3-0తో భారత్ సిరీస్ కైవసం.
218 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదట తడబడింది, లసిత్ మలింగ్ మూడవ ఓవర్లోనే శిఖర్ ధావన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత 10 పరుగులకే కెప్టెన్ విరాట్ కోహ్లీ (3) ఫెర్నాండో బౌలింగ్‌లో చమీరా చేతికి చిక్కాడు. ఈ దశలో లోకేశ్ రాహుల్ (17; 24 బంతుల్లో 2×4)తో కలిసి ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు.

మరోసారి రాణించిన ధనంజయ:
భారత్ ఇన్నింగ్స్ గాడిన పడిందనుకున్న సమయంలో స్పిన్నర్ ధనంజయ మాయ చేశాడు, జట్టు స్కోరు 61 వద్ద రాహుల్ (17), బౌండరీ దగ్గర లంక ఆటగాడు క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్ ను డకౌట్ చేయడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్ మరింత కష్టాల్లో కురుకుపోయింది.
రోహిత్ సూపర్ సెంచరీ
జాదవ్ పెవిలియన్ తో బ్యాటింగ్ కి వచ్చి మహేంద్ర సింగ్ ఓపెనర్ రోహిత్ తో కలిసి జట్టును ముందుకు నడిపించారు. రోహిత్ అద్బుతమైన క్లాసిక్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు, 16 ఫోర్లతో, రెండు సిక్స్‌లతో 124 పరుగులు చేశాడు, తన వన్డే కెరీర్‌లో 12వ సెంచరీ సాధించాడు.
ఆకట్టుకున్న ధోనీ:
నాలుగు వికెట్లతో కష్టాల్లో కూరుకుపోయిన భారత్ ను మహేంద్రసింగ్ ధోనీ రోహిత్ కలిసి ఆచితూచి ఆడాడు, సింగిల్స్ తో స్ట్రైక్ రోటెట్ చేశారు. ధోనీ 86 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 67 పరుగులు చేశాడు. రోహిత్, ధోనీ కలిసి శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోని టార్గెట్ ను చేధించారు.
అంతకు ముందు టాస్ గెలిచి బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్ తొలి నుంచీ తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగింది. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో తిరిమన్నే 80 పరుగులు చేసి జట్టుకు తనదైన పాత్ర పోషించాడు. అయితే తిరిమన్నే అవుటయ్యాక ఇక ఏ దశలోనూ కోలుకోలేదు. శ్రీలంక బ్యాట్స్‌మన్లలో తిరిమన్నే తరువాత చండీమల్ (36), సిరివర్దన (29) పరవాలేదనిపించారు. మిగతా వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. డిక్‌వెల్లా 13, మెండిస్ 1, మాధ్యూస్ 11, కెప్టెన్ కపుగెదెర 14, దనంజయ 2, చమీర 6, ఫెర్నాండో 5 (నాటౌట్), లసిత్ మలింగ 1(నాటౌట్) పరుగులు చేశారు.
అదరగొట్టిన బూమ్రా:
భారత్ బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మొదటి నుండి ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బూమ్రా పది ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు( 10-2-27-5) అందులో రెండు మేడిన్ ఓవర్లున్నాయి. ఐదు వికెట్లు తీసీ లంకను కట్టడి చేసిన బూమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

లంక అభిమానుల ఆగ్రహాం...
44 ఓవర్లకు భారత్ 210 పరుగులు చేసి విజయానికి 8 పరుగుల దూరంలో ఉండగా.. భారత విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు ఆగ్రహాంతో మైదానంలోని ఫీల్డర్లపై పెద్ద ఎత్తున బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేసిన అంపైర్లు.. కొద్దీ సేపటి అనంతరం మ్యాచ్‌ను పునప్రారంభించారు. మరో 7 బంతులు ఆడిన భారత్ లక్ష్యాన్ని చేదించింది.
గ్రౌండ్‌లోనే నిద్రించిన ధోనీ:
శ్రీలంకతో జరగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్డేడియంలో హాయిగా నిద్రించాడు. దోనీ, రోహిత్ క్రీజులో ఉన్న సమయంలో భారత విజయాన్ని తట్టుకోలేని స్డేడియంలోని లంక అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసరడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అరుస్తూ బాటిళ్లు, తమ చేతిలోని వస్తువులను మైదానంలోకి విసురుతూ ఆటకు అంతరాయం కలిగించారు. కొందరు గ్రౌండ్ సిబ్బంది సాయంతో బాటిళ్లు, ఇతరత్రా వస్తువులను తొలగించారు. ఈ తతంగం జరుగుతుండటంతో రోహిత్, ధోనిలు కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యారు.

ఎంతకూ మ్యాచ్ విషయం తేలకపోవడంతో ధోని హాయిగా నిద్రిస్తూ కనిపించాడు. కూల్ ప్లేయర్ గా ముద్రపడ్డ ధోని, లంక అభిమానుల చేష్టలకు ఏమాత్రం కూడా అసహనానికి గురికాలేదు. ఫీల్డ్ అంపైర్లు కాసేపు చర్చించి ఆటను తాత‍్కాలికంగా నిలిపివేశారు.
మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చెయ్యండి
