ఆ విష‌యంలో పాక్ క‌ంటే ఇండియా లో దారుణం.

India had less than doctors to pak
Highlights

  • ఇండియాలోొ డాక్టర్ల కొరత.
  • ప్రతి 1622 మందికి ఒక్క డాక్టర్.
  • పక్కన ఉన్న పాక్ కన్న తక్కువ.

ఇండియాలో వైద్యుల కొర‌త భారీగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య తాజాగా నివేదికలో తెలిపింది. ప్ర‌పంచ ఆరోగ్య నివేదిక ప్రకారం ఇండియాలో ప్ర‌తి 1622 మంది ప్ర‌జ‌ల‌కు ఒక్క డాక్ట‌ర్ ఉన్నార‌ని తెలిపింది.ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్ ప్ర‌జ‌లు డాక్ట‌ర్ల నిష్ప‌త్తిలో 57 వ స్థానంలో ఉంద‌ని పెర్కొంది.

భార‌త‌దేశ వ్యాప్తంగా ఉన్న వంద కోట్ల పైగా జ‌నాభాకు కేవ‌లం 8.18 ల‌క్ష‌ల మంది డాక్ట‌ర్లు ఉన్న‌ట్లు తెలిపింది. సాధార‌ణంగా ప్ర‌పంచ ఆరోగ్య నివేధిక ప్ర‌కారం ప్ర‌తి వెయ్యి మందికి ఒక డాక్ట‌ర్ ఉండాలి. డాక్ట‌ర్, ప్ర‌జ‌ల నిష్ప‌త్తిలో భార‌త్ లో 0.62 డాక్ట‌ర్ కు 1000 మంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని తెలిపింది. అత్య‌ధికంగా ఆస్ట్రేలియాలో ప్ర‌తి వెయ్యి మందికి 3.37 మంది డాక్టర్లు అందుబాటు లో ఉన్నారు. త‌రువాత స్థానంలో బ్రిజిల్ లో 1000:1.37 గా ఉన్నారు.

 చివ‌రికి మ‌న ప‌క్క‌ను ఉన్న పాక్ లో ప్ర‌తి వెయ్యి మంది .89 డాక్ట‌ర్లు ఉన్నారు. ఇక  బంగ్లాదేశ్ లో కూడా 1000:0.91 డాక్ట‌ర్లు ఉన్నారు. అంటే మ‌న‌తో పోల్చితే ఈ రెండి దేశాల‌లో కూడా అత్య‌ధికంగా ఉన్నారు. భార‌త్ లో మాత్రం త‌క్కువ ఉండ‌టం విశేషం. ఈ పరిణామం చాలా ప్ర‌మాద‌క‌రం అని త్వ‌ర‌గా భార‌త్ వైద్యుల తయారీ పై దృష్టి సారించాల‌ని సూచించింది.   

loader