వివాహేతర సంబందానికి ఒక వ్యక్తి బలి

First Published 15, Mar 2018, 4:57 PM IST
Illicit affair lead to murder at jagityala district
Highlights
  • జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య
  • అక్రమ సంబందమే కారణం

వివాహేతర సంబందం  ఓ నిండు ప్రాణాన్ని  బలితీసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తన కూతురితో వివాహేతర సంబందం పెట్టుకున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా నరికిచంపాడొ తండ్రి. ఈ ఘటనకు సంబందించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో గ్రామానికి చెందిన దళిత యువకుడు రాగుల సురేశ్‌(31) రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేస్తున్నాడు. ఇతడికి భార్య శైలజ, కూతురు ఉన్నారు. అయితే సురేష్ అదే గ్రామానికి చెందిన ఓ ఉన్నత వర్గానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి సురేశ్‌ను ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మహిళతో సంబందాన్ని తెంచుకోలేదు. దీంతో అతడు సురేష్ పై కక్ష పెంచుకున్నాడు.  

తన కూతురిని లోబర్చుకున్న సురేష్ ఎలాగైనా హతమార్చాలని గంగిరెడ్డి ప్లాన్ వేశాడు. సురేష్ ఉదయాన్నే విధులకు వెళ్లే సమయంలో దాడి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ ప్రకారం బుధవారం ఉదయం తన కొడుకు సంతోష్ రెడ్డి తో కలిసి సురేష్ కోసం గ్రామ శివారులో కాపుకాశాడు. వీరు అనుకున్నట్లే సురేష్ అటువైపు బైక్ పై వచ్చాడు. దీంతో వీరిద్దరు కలిసి సురేష్ ను కర్రలతో,  కొడవలితో దాడిచేశారు. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న మెట్‌పెల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సై కిరణ్‌కుమార్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు సురేష్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్ల

loader