నిద్రపోతే మరణం శాశ్వత నిద్రలోకే. కోట్లలో ఒకరికి వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ మందికి
ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి రాత్రిపూట నిద్రపోతారు. ఒక్క రోజు అయినా మన శరీరానికి నిద్రలేకపోతే తరువాతి రోజు మనం ఏం పని చెయ్యలేము. మరీ ప్రతి రోజు అస్సలు నిద్రలేకపోతే.. చాలా కష్టం కదా.. ఇంగ్లండ్ లో ఒక అబ్బాయి నిద్ర లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

పేరు డెర్చిపిషర్, ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతడు కానీ నిద్రపోతే.. ప్రాణం కోల్పోతాడు. ఈ యువకుడు హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అనే విచిత్ర వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా ఆ యువకుడు పుట్టినప్పటి నుండి నిద్ర సరిగ్గా లేకుండా జీవిస్తున్నాడు. ఇప్పటికి తన వయస్సు 17 సంవత్సరాలు. ఆ యువకుడు నిద్రపోతే.. ప్రాణాలు కోల్పోతాడు. డెర్బిపిషర్ నిద్రపోవాలంటే డాక్టర్ల సమక్షంలో తగిన భద్రత తో నిద్రకు ఉపక్రమించాలి. లేకుండా నిద్రపోలేడు. ఒకవేళ అలా కాదని నిద్రపోతే.. ఈ వ్యాధితో అతని లివర్ పనిచేయడం ఆగిపోతుంది. ఇంకా హార్ట్ బీట్ తగ్గిపోతుంది. రక్తపోటు ఏర్పడుతుంది. నిమిషాల్లో అతను మరణిస్తాడు.
ఆ యువకుడికి వచ్చిన వ్యాధి పై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా ఈ వ్యాధి కల్గిన వాళ్లు ఉంటారు.
