చైనా, భారత్ సరిహాద్దుల్లో ప్రశాంతత నెలకొనాలి. నా గెలుచుకున్న టైటిల్ ను తిరిగి మీకు ఇచ్చేస్తాను. దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువ
భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తెలిసినవే, గత నెల రోజుల నుండి చైనా, భారత్ భూటాన్ సరిహద్దు ప్రాంతం అయినా డొక్లాంలో చైనా భారీగా బలగాలను దింపింది. మీడియాలో కూడా ఇండియాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుంది. అయితే వాటిని తగ్గించాలని బాక్సింగ్ ఛాంఫియన్ విజేంధర్ కొరారు.
శనివారం రాత్రి చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటయాలిని మట్టి కరిపించి ఆసియా పసిఫిక్ సూపర్ ఛాంఫియన్ షిప్ ను గెలుచునున్న సంగతి తెలిసింది. అయితే ఆయన ఆ టైటిల్ తనకి వద్దని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు వద్దని కొరారు విజేందర్. డోక్లాం సరిహద్దులో నెలకొన్నప్రతిష్టంభన దృష్ట్యా తన టైటిల్‌ను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని విజేందర్ ప్రకటించాడు.
గెలిచిన ఆనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతు చైనా ప్రజలకు తాను గెలుచుకున్న టైటిల్ ను తిరిగి ఇవ్వడానికి సిద్దమని, డొక్లాం సరిహాద్దుల్లో ప్రశాంతత నెలకొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజేందర్ చేసిన విజ్ఞప్తికి ఇండియాలో ప్రజలు ఆయనకు అభినంధనలు తెలిపారు.
