నాపై కూడా లైంగిక దాడి జరిగింది. దేశంలో అందరు దీనిపై కలిసి పోరాడాలి. మహిళలకు ప్రత్కేక రక్షణ కల్పించాలి
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ తన గురించి సంచలన వ్యాక్యలు చేశారు. ఆయన కూడా లైంగిక దాడి భాధితుడి అని ధైర్యంగా చెప్పారు. గతంలో తన పై లైగింక దాడి జరిగిందని వేలాది మంది మద్య తెలిపారు. ఇప్పుడు ఇదే విషయం వైరల్ అయింది.
కేవలం ఆడవారి పైన మాత్రమే లైంగిక వేధింపులు ఉన్నాయని భావించిన అందరు, అక్షయ్ కుమార్ మాటలతో కొంత ఆశ్చర్య పోయ్యారు. మగవారి పైన కూడా లైంగిక దాడి జరుగుతుందని అక్షయ్ యావత్ ప్రపంచానికి తెలియజేశాడు.
దేశంలో మహిళల అక్రమ రవాణా, మహిళల వేధింపులు ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ అంశం ఇటు ప్రభుత్వానికి, అటు మహిళ లోకానికి కూడా అందోళనకు గురించేస్తుంది. ఇదే అంశంపై ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహంచారు. అందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు... ఎప్పుడు హుషారుగా మాట్లాడే అక్షయ్ ఈ సమావేశంలో మాత్రం కాస్తా ఉద్వేగంగా మాట్లాడారు. అక్కడికి వచ్చిన వేలాది మందిని ఉద్దేశించి నేను కూడా మహిళల్లాగే ఒకప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని అన్నారు.
తనకి 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌లో వెళ్తుంటే పక్కనే ఉన్న లిఫ్ట్‌బాయ్ నన్ను ఎక్కడపడితే అక్కడ తాకాడు. నును ఏ మాత్రం భయంకుండా వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పానని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తన తల్లీదండ్రులు ఆ లిప్ట్ బాయ్ ని గట్టిగా మందలించారని పెర్కొన్నారు. కొద్ది రోజుల తరువాత ఆ లిప్ట్ బాయ్ ఇలాంటి వేధింపుల కేసులోనే అరెస్టు అయినట్లు చెప్పుకొచ్చారు.
ఇలా జరగడం మగ పిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఆడ పిల్లలకు ఎక్కువగా జరగుతుందని ఆయన తెలిపారు. అయితే తల్లిదండ్రలు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు బయటికి చెప్పడానికి సంకోచిస్తు ఉంటారని, అందుకు తల్లీదండ్రులు చోరవ తీసుకోవాలని తెలిపారు. మహిళల లైంగిక వెధింపుల మీద దేశ వ్యాప్తంగా అందరు కలిసి ఉద్యమంగా పోరాడాలని సూచించారు. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పెర్కోన్నారు.
