ఇవాళ ఆ పని చేస్తే ప్రమాదంలో పడతారంటున్న డిసిపి (వీడియో)

First Published 31, Dec 2017, 2:42 PM IST
hyderabad traffic dcp ranganath video
Highlights
  • ఇవాళ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉండనున్నాయో వివరించిన డిసిపి రంగనాథ్

నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డిసిపి రంగనాథ్ తెలిపారు. ఇందులో భాగంగా డ్రంకన్ డ్రైవ్ ను నిరోదించేందుకు సిటీ వ్యాప్తంగా 100 స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవాళ రాత్రి 10 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా నూతన సంవత్సర వేడుకల్లో ఒక్క ప్రమాదం కూడా జరగలేదని, అలాగే ఈ సంవత్సరం కూడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రంగనాథ్ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ జోలికి వెళ్లకుండా నగర వాసులు హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, అందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.

డ్రంకన్ డ్రైవ్ నిరోదానికి పోలీస్ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెబుతున్న చెబుతున్న డిసిపి

 

loader