హైదరాబాద్ లో అర్ధరాత్రి దారుణం మల్లెపల్లి లో యువకుల స్ట్రీట్ ఫైట్

హైదరాబాద్ మల్లేపల్లిలో నిన్న అర్ధరాత్రి కొందరు యువకులు రెచ్చిపోయారు. కేవలం రూ.1200 కోసం వాదులాటకు దిగిన యువకులు నానా హంగామా సృష్టించారు. వీధి రౌడిల్లా ప్రవర్తిస్తూ నడి రోడ్డుపైనే కత్తులతో, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

దీనిపై సమాచారం అందుకుని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే దుండగులంతా పరారయ్యారు. అయితే అక్కడున్న సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు వీటి ఆధారంగా గొడవకు కారణమైన యువకులను పట్టుకునే పనిలో పడ్డారు.

గొడవ ఎలా జరిగిందో కింది వీడియోలో చూడండి