మహిళను వేధించిన కేసులో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని డిసిపి చితకబాదిన వీడియో బయటకు రావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. నిందితున్ని తంతూ దుర్భాషలాడిన పోలీసు అధికారి వ్యవహారశైలిపై  కాకుండా ఆ వీడియో ఎలా బైటకు వచ్చిందన్నదానిపైనే పోలీస్ బాసులు దృష్టి సారించారు.  ఈ వ్యవహారంలో డిసిపి కి అండగా నిలిచిన ఉన్నతాధికారులు ఈ వీడియో తీసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోడానికి రంగం సిద్దం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ లేకుండా వీడియోలు తీయడం నేరమన్న మాధాపూర్ డిసిపి విశ్వప్రతాప్ దీనిపై విచారణ చేపడుతున్నారు. 

 షార్ట్ ఫిల్మ్ లో నటించిన ఓ యువతిని వేధించిన డైరెక్టర్ యోగిని గచ్చిబౌలి అదనపు అడిషనల్ డిసిపి గంగిరెడ్డి పోలీస్ స్టేషన్ కు పిలిపించి యువతి ముందే విచారణ చేపట్టాడు.  విచారణలో బాగంగా డిసిపి నిందితుడిని చితకబాదుతూ, బూటు కాలితో తంతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై మాధాపూర్ డీసీపీ విశ్వప్రతాప్ స్పందిస్తూ... నిందితుడు యోగి పోలీసుల ముందే అసభ్యకరంగా మాట్లాడినందుకు  డిసిపి చర్యలు తీసుకున్నట్లు తెలిపాడు. అయితే పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ విచారణ వీడియో ఎలా బైటకు వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో అనుమతి లేకుండా వీడియోలు తీయడం నేరమని, అందులోను ఓ నిందితుడిని విచారిస్తున్నపుడు ఈ వీడియో తీశారని దీనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని డిసిపి తెలిపారు.
 
యువతిపై వేధింపుల కేసులో డైరెక్టర్ యోగీపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు డిసిపి తెలిపారు. అయితే యోగితో వచ్చిన అతడి ప్రెండే ఈ విచారణ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తుందని, దీనిపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కేసుపై సీపీతో సమావేశమయ్యాక తదుపరి వివరాలను వెల్లడిస్తానని డిసిపి విశ్వ ప్రతాప్ తెలిపారు.

డైరెక్టర్ ను డిసిపి చితకబాదుతున్న వీడియో కోసం కింది లింక్ క్లిక్ చేయండి

https://goo.gl/CLaJ7t