హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డుపై మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో కారు లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమయ్యింది.  ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరగ్గానే క్షతగాత్రుడిని కారులోంచి బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి  ఆంధ్రప్రదేశ్  పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

వీడియో