మద్యం మహమ్మారికి మరో నిండు ప్రాణం బలైంది. ఫుల్లుగా మందు కొట్టి అర్థరాత్రి లాంగ్ డ్రైవ్ కి వెళ్లిన ఓ విద్యార్థిని అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ప్రాణాలను వదిలింది. మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపపడ్డారు.

ఈ ప్రమాదానికి సంభందించిన వివరాల్లోకి వెళ్లితే యూపీ కి చెందిన అనన్య అనే యువతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోంది. అయితే నిన్న ఆమె స్నేహితుడు నితిన్ భర్త్ డే ఉండటంతో అర్థరాత్రి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో ఫుల్లుగా మద్యం సేంవించిన అనన్య, నితిన్ లో పాటు మరో విద్యార్థిని నిఖిత లు కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. అయితే ఈ డ్రైవ్ ముగించుకుని తిరిగి వస్తుండగా బూర్జుగడ్డ వద్ద ఓ ఆర్ ఆర్ పై కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనన్య అక్కడికక్కడే మృతి చెందగా నితిన్, నిఖితలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.