హాస్టల్ బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య

హాస్టల్ బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ ఓ ఇంజనీరింగ్ కాలేజి లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజకొండ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవుతున్న విక్రమ్ అనే ఫోర్త్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

మంచిర్యాలకు చెందిన విక్రమ్ హైదరాబాద్ లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఇతడు మీర్ పేట్ పరిధి లోని మణికంఠ నగర్లో ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే ఇతడు మొదటి సంవత్సరం నుండి చదువును కాస్త నిర్లక్ష్యం చేయడంతో ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి ఇరవై బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. ఇలా చదువుల్లో వెనుకబడిపోడంతో భవిష్యత్ పై బెంగ పెట్టుకుని గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉంటున్నాడు. ఈ ఆందోళన ఎక్కువవడంతో ఇవాళ దారుణానికి ఒడిగట్టాడు. హాస్టల్ లోని మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos