హైదరాబాద్ లో భూకంపం

హైదరాబాద్ లో భూకంపం

ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ కంపన తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ  ఒక్కసారిగా భూమిలో స్వల్ప కదలికలు మొదలవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 
దీనిపై సమాచారం అందుకున్న నేషనల్ జియోపిజికల్ రిసెర్చ్ ఇన్టిట్యూట్ అధికారులు భూకంప తీవ్రతను పరిశీలించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 0.5 గా నమోదయ్యింది. ఇదేమంత తీవ్రమైనది కాదని ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. భూకంప కేంద్రం( కంపనాలు మొదలయ్యే ప్రాంతం) కేబీఆర్ పార్కు వద్ద గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
భూకంప తీవ్రత గుర్తించలేనంతగా ఉందని స్థానికులు చెబుతున్నారు. చిన్న వైబ్రేషన్ వచ్చినట్లుగా భూమి కదలిందని. ఇది గమనలేనంతగా ఉందని చెబుతున్నారు. అది ఎక్కువ అవుతుందేమోనని కొందరు ఇళ్లలోకి బయటకు పరుగులు తీసినట్లు కొందరు స్థానికులు తెలిపారు. 
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి భూ పొరల్లో స్వల్ప సర్దుబాటు జరగడంతో ఈ కదలిక సంభవించినట్లు ఎన్ఆర్ జిఐ అధికారులు తెలిపారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos