ట్రాఫిక్ పోలీసులు, ప్రభత్వ ఎన్ని నిబంధనలు పెట్టినా నగర వాసుల్లో మార్పు రావడం లేదు. ఇటీవల హెల్మెట్ లేకుండా, డ్రంకన్ డ్రైవ్ చేసి ఏంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా చూశాం. కానీ ఈ కింది వీడియోలోని వాహనదారుడిది మరో రకమైన ట్రాపిక్ ఉల్లంఘన. హైదరాబాద్ రోడ్లపై ఈ వాహనదారుడు ఓ చిన్నారిని ఇలా బైక్ వెనకాల కూర్చోబెట్టి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో చూడండీ. అసలు ట్రిపుల్ రైడింగే నేరం అనుకుంటే ఇలా చిన్నారిని కూర్చోబెట్టి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేశాడు. ఈ దృశ్యాలను ఈ బైక్ వెనకాల ఉన్న వాహరదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ నిర్లక్ష్యపు బైక్ డ్రైవర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. 

వీడియో