కుటుంబ కలహాల కారణంగా ఓ యువతి హుస్సెన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే ఈమె హుస్సెన్ సాగర్ లో దూకడాన్ని గమనించిన ఇద్దరు పోలీసులు వెంటనే  నీళ్లలోకి దూకి ఆమెను కాపాడారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువతిని కాపాడి బయటికి తీసుకువచ్చారు. ఎవరెక్కడ పోతే తమకెందుకు తాము హ్యాపిగా ఉన్నాం కదా అనుకునే ఈ రోజుల్లో ముక్కూమొహం తెలియని యువతి కోసం ఇంత సాహసం చేసిన పోలీసులను అందరూ ప్రశంసిస్తున్నారు.

యువతిని ఎలా కాపాడారో చెబుతున్న పోలీసుల వీడియోను కింద చూడండి