భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త (వీడియో)

భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త (వీడియో)

మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్ నగర్ లో దారుణం జరిగింది. ఓ వివాహితపై భర్తతో కలిసి వచ్చిన స్నేహితుడే అత్యాచారం చేశారు. దీంతె బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కీచక భర్త, స్నేహితుడి  ఆటవిక ఆకృత్యం బైటపడింది.

వివరాల్లోకి వెళితే జవహార్ నగర్  పోలీసుస్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ దొండతోటలో హేమలత అనే మహిళ తన భర్తా, పిల్లలతో కలిసి నివాసముంటోంది. అయితే తాగుడుకు బానిసైన భర్త వీరిని అసలు పట్టించుకునేవాడు కాదు. ఇలా ఓ రోజు తన స్నేహితుడితో కలిసి పుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో పిల్లలతో కలిసి పడుకున్న హేమలత ను బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ సమయంలో భర్త ఇంట్లోనే ఉన్న దీన్ని ఆపలేదు. నీ భర్తే ఇలా చేయమన్నాడని ఆ దుర్మార్గుడు తనతో తెలిపాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.  

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పేరు శివ అని, అతడివయసు 23సంవత్సరాలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని శివ తల్లికి తెలిపినా ఆమె కూడా తనదే తప్పన్నట్లు మాట్లాడిందని, చివరకు ఓ పాస్టర్ సాయంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసుల్ని కోరినట్లు బాధితురాలు వివరించింది.

 

బాధితురాలి ఆవేదనను కింది వీడియోలో చూడండి

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos