ఆ పని చేస్తే ఉద్యోగమిస్తానని యువతిని వేధించిన హెచ్ఆర్

ఆ పని చేస్తే ఉద్యోగమిస్తానని యువతిని వేధించిన హెచ్ఆర్

ఉద్యోగం కోసం సంప్రదించిన ఓ యువతిపై కన్నేసిన ఓ హెచ్ఆర్ మేనేజర్ షీ టీమ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఉద్యోగం కావాలంటే  తన హాట్ పోటోలను పంపించాలని యువతిని డిమాండ్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఈ కీచక హెచ్ఆర్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. 
వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేట్ కంపెనీలో నరేందర్ సింగ్ హెచ్ఆర్ హెడ్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల కంపెనీలో ఐటీ ఉద్యోగీల కోసం ఇటీవల కొందర్ని ఇంటర్వ్యూ చేశాడు. అంతుకోసం వచ్చిన ఓ అమ్మాయపై కన్నేశాడు ఈ హెచ్ఆర్. అయితే ఇంటర్వ్యూ ముగిసి చాలారోజులవడంతో ఏమైందో కనుక్కుందామని యువతి వాట్సాప్ లో నరేందర్ కు మెసేజ్ పంపింది. అయితే ఇదే అదునుగా భావించిన అతడు తన హాట్ పోటోలను పంపితే ఉద్యోగం ఇప్పిస్తానని రిప్లై పంపాడు. దీంతో అతడి దురుద్దేశం అర్థమైన యువతి అతడిపై షీ టీమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos