బంగారమంటే ఇష్టం ఉండనివారు ఎవరు ఉంటారు చెప్పండి.. అందులోనూ మన దేశంలో బంగారం వాడుక ఎక్కువ. కేవలం ఒక
సంవత్సరంలో భారత్ దాదాపు 663 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తోందట. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ దీనిపై ఓ సర్వే  చేసింది. ఈ సర్వే
ప్రకారం ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తున్న దేశం మనదే.ఇందులో 50శాతం బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు కేవలం వివాహాలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఎక్కవగా విక్రయాలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే  గోల్డ్ కొనుగోలులో
మళయాళీలు ముందంజలో  ఉంటే రెండో స్ధానంలో మన తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, మహారాష్ట్ర,
బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.