కాంగ్రెస్ ఎమ్మెల్యే చెంపవాయించిన మహిళా కాన్ స్టేబుల్ (వీడియో)

Himachal Cong MLA Asha slaps woman constable and gets back slap
Highlights

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే చెంపవాయించిన మహిళా కాన్ స్టేబుల్
     

కాంగ్రెస్ ఎమ్మెల్యే చెంపవాయించిన మహిళా కాన్ స్టేబుల్

 

ఈ  రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ పర్యటన సందర్భంగా ఒక పార్టీ ఎమ్మెల్యేకి జీవితంలో మరచిపోలేని చేదు అనభవం ఎదురయింది.కనివిని ఎరుగని రీతిలో ఆమె ఒక మహిళా కాన్ స్టేబుల్ చేతిలో  చెంపదెబ్బ తినింది. ఇంతకి జరిగిందేమిటంటే...రాహుల్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే ఆశా కుమారి పార్టీ  కార్యాయలం దగ్గరకు చేరుకున్నారు. అయితే పోలీస్‌ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఇది ఆమెకు ఆగ్రహం తెప్పించింది. కాన్ స్టేబుల్ తో వాగ్వాదినికి దిగింది అంతేకాదు,  మహిళా కానిస్టేబుల్‌ చెంప పగలకొట్టింది. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్‌ కూడా ఆమె చెంప వాయించింది. వివాదం ముదరడంతో అక్కడే ఉన్న వారు ఆ ఇద్దర్నీవారించారు. తర్వాత దిగొచ్చిఆశాకుమారి తాను చేజారినందుకు క్షమాపణలు చెప్పారు. 'ఆ మహిళా కానిస్టేబుల్‌ నన్ను తిట్టింది. నన్ను తోసింది. ఆమె నన్ను వెళ్లకుండా నిలువరించాల్సింది.. నాకు ఆమె తల్లికున్న వయసు ఉంటుంది. అయితే, ఈ సమయంలో నేను నా సహనాన్ని కోల్పోకుండా ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సింది. నేను అందుకు క్షమాపణలు చెబుతున్నాను' అని మీడియాకు చెప్పింది.

loader