అస్ట్రేలియాలో విధ్యార్ధినుల పై లైంగిక దాడులు. సగం మందికి పైగా జరుగుతున్నాయి. నివేధిక సమర్పించిన మానవ హాక్కుల సంఘం.

నేడు స‌మాజం లో ఆడ, మ‌గ తేడా లేకుండా ప్ర‌యాణిస్తుంది. ఇరువురికి స‌మాన అధికారాలు క‌ల్పిస్తుంది. కానీ కేవ‌లం బ‌య‌టికి మాత్ర‌మే స‌మానం అంటున్నారు, ఇప్ప‌టికి ఆడ‌వారిపైన చిన్న చూపు కొన‌సాగుతునే ఉంది. ఆడ‌వారిపై చిన్న చూపు ఏ ఒక్క దేశానికి మాత్రమే ప‌రిమితం కాలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిస్థితి ఇలాగే ఉంది. తాజా వెలుగులోకి వ‌చ్చిన ఒక నివేధిక‌తో మరింత బ‌లంగా ఉంద‌ని తెలుస్తుంది.


అస్ట్రేలియా యూనివర్శీల‌ పై మాన‌వ హాక్కుల సంఘం ఒక నివేధికను అక్క‌డి ప్రభుత్వానికి అందించింది. అందులో ప్ర‌ధానంగా అమ్మాయిల‌పై లైంగిక దాడుల గురించి ప్ర‌స్త‌వించింది. యూనివ‌ర్శీటీల్లో చ‌దువుతున్న అమ్మాయిల‌పై అధికంగా లైంగిక దాడులు జ‌రుగ‌తున్న‌ట్లు తెలిపింది. ఆ దేశంలో ఉన్న అన్ని యూనివ‌ర్శీటీల అమ్మాయిల‌ను విచారించిన మాన‌వ హాక్కుల సంఘం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది


దీనిపైన ది గార్డియ‌న్ సంస్థ ఒక ఆర్టీక‌ల్ ను ప్ర‌చురించింది. ఆగ‌ష్టు ఒక‌టవ‌ తేదీన ఒక లైవ్ డిబెట్ నిర్వ‌హించారు అందులో వేలాది మంది ఆస్ట్రేలియ‌న్ అమ్మాయిలు పాల్గోన్నారు. వారు.. లైంగిక దాడుల పైన స‌రైన చ‌ట్టం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు.