ప్రియా వారియర్... ఈ మలయాళ కుట్టి తన హావభావాలతో దేశ ప్రజల మనసులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఆమె చిన్న ఎక్స్ ప్రెషన్, ఆమె నటించిన సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  దేశమంతా ఆమె గురించి, ఆమె కన్నుగీటుడు గురించే మాట్లాడుకుంటోంది. మరి మేమేం తక్కువ తినలేదన్నట్లు రాజకీయ నేతలు కూడా ఇప్పుడు ప్రియా వారియర్ పాట పాడుతున్నారు. మరి రాజకీయాల్లోకి ప్రియా వారియర్ సబ్జెక్ట్ ఎందుకొచ్చినట్లు అనుకుంటున్నారా? అయితే చదవండి స్టోరీ.

ప్రియా వారియర్ వీడియోల నేపథ్యంలో ఆమెను చూసి ఆర్ఎస్ఎస్ బుద్ది తెచ్చుకోవాలి అని చురకలు అంటించారు గుజరాతీ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మేవానీ. ఆర్ఎస్ఎస్ నేతలపై ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రియా వారియర్ వైరల్ వీడియోలను ప్రస్తావించారాయన.

ప్రియా వారియర్  కు సంబంధించిన ఈ ప్రేమ వీడియోలు పాపులర్ కావడం... భారతీయుల మనస్తత్వాన్ని తెలియజేస్తోందని మేవానీ వ్యాఖ్యానించారు. భారతీయులు ప్రేమను ప్రేమిస్తారు అనే విషయాన్ని చెప్పడానికి వైరల్ గా మారిన ప్రియా వారియర్ వీడియోలే సాక్ష్యమని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. 

కానీ ఆర్ఎస్ఎస్ వారు ప్రేమను వ్యతిరేకిస్తూ ద్వేషాన్ని ఇష్టపడతారన్నారు. ‘ఆర్ఎస్ఎస్ వారికి ఆఖరికి ప్రేమికుల రోజు అన్నాపడదు అని విమర్శించారు. అయితే భారతీయులు అలా కాదు. ఒకరిని ద్వేషించడాని కన్నా.. ప్రేమించడానికే ఇండియన్స్ ఇష్టపడతారని దళిత నేత చెప్పారు. ప్రియా ప్రకాష్ వారియర్ వీడియోలే ఆర్ఎస్ఎస్ కు సమాధానం చెప్పాయని పంచ్ వేశారు.