నోటా విధానాన్ని  కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు వ్యతిరేకించాయి  రాజ్యసభ ఎన్నికల్లోనే తొలిసారిగా నోటా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్నికల కమిషన్‌ రాజ్యసభ ఎన్నికల్లో సీక్రెట్‌ బ్యాలెట్‌ను ఉపయోగించరు

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ ( నన్ ఆఫ్ ది ఎబోవ్) ఉంటుందని ఈ రోజు సుప్రీం కోర్టు పేర్కొంది. . రాజ్యసభ ఎన్నికల్లో నోటా విధానాన్ని పెట్టడాన్ని కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు వ్యతిరేకించాయి.

అయితే.. నోటాపై స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కాంగ్రెస్ పిటీషన్ ను తోసిపుచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో నోటా కచ్చితంగా ఉంటుందని సుప్రీం తీర్పు వెలువరించింది.

 రాజ్యసభ ఎన్నికల్లోనే తొలిసారిగా నోటా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్నికల కమిషన్‌. రాజ్యసభ ఎన్నికల్లో సీక్రెట్‌ బ్యాలెట్‌ను ఉపయోగించరు. ఓటేసిన ఎమ్మెల్యేలు తమ పత్రాన్ని తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌కు చూపించిన తర్వాతే బ్యాలెట్‌ బాక్సులో వెయ్యాల్సి ఉంటుంది.ఏ పార్టీకి చెందిన ఎమ్మేల్యే అయినా.. ఏ పార్టీకైనా ఓటు వేయవచ్చు.. లేదా నోటా బటన్ అయినా ఉపయోగించవచ్చు. దీని వలన ఆ ఎమ్మేల్యేను పార్టీ తొలగించకూడదు.

ఈ గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో భాజపా నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని విడగా.. మిగిలిన ఎమ్మేలు పార్టీని విడకుండా ఉండేందుకు వారిని బెంగళూరు రిసార్ట్స్ కి తరలించిన సంగతి తెలిసిందే.