కృష్ణా జిల్లా గుడివాడలో ఇద్దరు కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కాలేజీకి చెందిన ఇద్దరు స్పేహితులు కళాశాల ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. 

ఈ ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. గుడ్లవల్లేరుకు చెందిన సురేంద్ర (బి.కామ్ తృతీయ సంవత్సరం),వెంకటేశ్వరరావు (బి.ఏ  ద్వితీయ సంవత్సరం) లు ఎఎన్నార్ కాలేజీలో చదువుతున్నారు. అయితే వీరు గత కొన్ని రోజులుగా క్లాసులకు బంకులు కొడుతూ తిరుగుతున్నారు. ఇవాళ కాలేజీకి వచ్చిన వీరిద్దరు మద్యాహ్నం భోజనం అనంతరం కళాశాల వెనుకవైపుకి వెళ్ళి తమ వెంట తెచ్చుకున్న  పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డారు. దీన్ని  గమనించిన సహచర విద్యార్దులు స్దానిక  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరిని   మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి  తరలించారు. 


ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసిన గుడివాడ వన్ టౌన్  పోలీసులు ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు వీరి తోటి విద్యార్థులను విచారించారు. ఇరువురు ఆత్మహత్యాయత్నానికి  ప్రేమ విఫలమవడమే కారణమా? ఇంకా ఎదైనా  కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.