Asianet News TeluguAsianet News Telugu

ఫైవ్ స్టార్ హోట‌ళ్లు ఇక చుక్క‌లు చూపిస్తాయి

  • ఫైవ్ స్టార్ హోటళ్లు మరింత కాస్ట్ అయ్యాయి.
  • 28శాతం జిఎస్టి ప్రకటించిన కేంద్ర.
  • సాధారణ రేటు రూ 7500.
govt decide five star hotels GST rate for 28

ఫైవ్ స్టార్ హోట‌ళ్లు అంటేనే చాలా కాస్ట్, తాజాగా ఫైవ్ స్టార్ హోట‌ళ్లకు కేంద్రం ఫిక్స్ చేసిన జిఎస్టి రేటుతో కొండెక్కి కూర్చున్నాయి. ఇక మీద‌ట ఫైవ్ స్టార్ హూట‌ళ్ల‌లో నివాసం ఉండాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు కేంద్ర తాజాగా విడుద‌ల చేసిన జిఎస్టీ రేటే కార‌ణం. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా ఉన్న జిఎస్టి స్లాబ్‌ల‌లో ఉన్న 28 శాతం  
రేటును ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కు కేటాయించారు. దీంతో గ‌తంలో ఉన్న చార్జీల క‌న్న 10 శాతం పెరిగాయి.


 గ‌తంలో ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో 18 శాతం ట్యాక్స్ వ‌సూళ్లు చేసేవారు ఇప్పుడు 28 శాతం కేంద్రం ఫిక్స్ చేసింది. దీనితో ఒక్క రోజు రాత్రి ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో నివాసం ఉన్న త‌క్కువ‌లో త‌క్కువ‌గా రూ 7500 చెల్లించాల్సిందే. గ‌తంలో ఈ ధ‌ర 5000 రూపాయ‌లు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 2500 రూపాయ‌లు ధ‌ర పెరిగింది. 

ఇప్ప‌టికే జిఎస్టి బిల్లు జూలై 1 వ తేది నుండి ప్రారంభ‌మైంది. కానీ చాలా మందికి సందేహాలు మాత్రం పోవ‌డం లేదు. జిఎస్టి బిల్లు అర్థం కాక రాష్ట్రల ప్ర‌భుత్వ అధికారులు, ఆర్థిక నిపుణులు త‌లప‌ట్టుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios