Asianet News TeluguAsianet News Telugu

రూ.2వేల నోట్లు రద్దు కాబోతున్నాయా..?

  • రూ.2వేల నోటు ముద్రణ  ఆపేసిన ఆర్ బిఐ
  • చలామణిలోకి రూ.1000 కాయిన్..?
government has decided to scrap the newly launched Rs 2000 note

దేశంలో నల్లడబ్బు బాగా పేరుకుపోయిందని.. దానిని అరికట్టేందుకు గతేడాది భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రూ.వెయ్యి, రూ.500నోట్లను రద్దు చేసిన సందతి విదితమే. వాటి స్థానంలో కొత్తగా రూ.2వేల నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే..ఈ రెండు వేల నోట్ల ముద్రణను ఆర్ బిఐ రద్దు చేసింది. దాని స్థానంలో రూ.వెయ్యి కాయిన్లు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నోటును రద్దు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.

 

ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని రాజ్యసభలో ప్రశ్నించారు.  కాగా..  అరుణ్ జైట్లీ మాత్రం దీనికి సమాధానం చెప్పకుండా దాట వేశారు.ఇప్పటి వరకు ఆర్ బిఐ 3.2లక్షల కోట్ల రూ.2వేల నోట్లను ప్రింట్ చేసిందని ..ప్రస్తుతం రూ.రెండు వేల నోటు ముద్రణను నిలిపివేసిందని సమాజ్ వాద్ పార్టీ నేత నరేష్ అగర్వాల్ జీరో అవర్ లో అన్నారు. ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దు చేయదలిస్తే ఆ విషయాన్ని ఆర్థిక మంత్రి సభలో తెలియజేయాలని ఆయన అన్నారు.

కాగా.. అది ఆర్ బిఐ తీసుకున్న నిర్ణయమని డిప్యుటీ ఛైర్మన్ కురియన్ అన్నారు. నోట్ల ముద్రణ, రద్దు నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని.. రిజర్వు బ్యాంక్ కాదని .. దానికి ఆ అధికారం లేదని ఈ సందర్భంగా నరేష్ అగర్వాల్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios