కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం మంత్రసానితో కాన్పులు చేయిస్తున్న వైనం  


 ప్రభుత్వ ఆస్పత్రులంటేనే నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని మరోసారి రుజువైంది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లు లేక మంత్రసానులు ఏకంగా ఆపరేషన్ థియేటర్ లో నెలలు నిండిన మహిళలకు ప్రసవాలు చేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు అమృత నగర్ లో నివాసముండే హసీనా అనే మహిళ కాన్పు కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అయితే ఆ సమయానికి ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో,అక్కడి సిబ్బంది అతితెలివిని ప్రదర్శించారు. గంగమ్మ అనే మంత్రసానిని పిలిపించి ఆమెతో డెలివరీ చేయించారు. దీంతో ఆందోళన చెందిన హసీనా తన బంధువులకు సమాచారం ఇవ్వడం తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అయితే మంత్రసాని గంగమ్మ డెలివరి ఎలా చేసిందో తెలుసా, ఆపరేషన్ థియేటర్ లో ఉన్న కత్తెరతో, స్టిక్ తో హసీనా శరీరంపై కొట్టింది. గట్టిగా గోళ్లతో రక్కింది. ఇలా నాటు పద్దతిలో ప్రసవం చేస్తుండటంతో అనుమానం వచ్చిన బంధువులు ఆరా తీశారు. అయితే మంత్రసాని గంగమ్మకు ఆస్పత్రికి ఎలాంటి సంభందం లేదని వైద్యులు తెలిపారు. 

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM