ఈ అమ్మాయి ముగ్గురమ్మాయిల్ని పెళ్లి చేసుకుంది (వీడియో)

ఈ అమ్మాయి ముగ్గురమ్మాయిల్ని పెళ్లి చేసుకుంది (వీడియో)

కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్లే కలియుగంలో చిత్ర విచిత్రాలు  మొదలయ్యాయి. ఆ విచిత్ర సంఘటన జరిగింది కూడా ఆయన జీవించిన రాయలసీమ లోనే కావడం విశేషం. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే ఓ అమ్మాయి తాను మగాడినని నమ్మించి మరో ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకున్న విచిత్ర సంఘటన కడప జిల్లా జమ్మలమడుగులో చోటుచేసుకుంది. 

ఈ సంఘటనకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి.  కాశినయన మండలంలోని ఇటికలపాడు గ్రామానికి చెందిన రమాదేవి (18) అనే యువతి తమిళనాడు ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేది. అయితే ఈమె తన వేషాన్ని మొత్తం మగాడిగా మార్చుకుని అమ్మాయిలకు ఎరవేయడం మొదలుపెట్టింది. మొదట ప్రొద్దుటూరుకు చెందిన బుజ్జి(16) అనే అమ్మాయిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమెను వదిలేసి అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలం లోని కొత్త చెరువు గ్రామానికి చెందిన వందన (17) అనే యువతిని వివాహం చేసుకుంది. ఇలా ఇద్దరి పెళ్లి చేసుకుని వదిలేసిన యువతి రమాదేవి తాజాగా జమ్మలమడుగు  సమీపంలోని భీమగుండం గ్రామానికి చెందిన నిర్మల(17)ను వివాహం చేసుకుంది .

ఆ అమ్మాయి ఏం చెబుతుందో చూడండి

 

ఇలా బైటపడింది

ఇలా మగ వేషంలో పెళ్లి చేసుకున్నాక తనకు సెలవులు లేవు, త్వరగా తమిళనాడు వెళ్లాలంటూ చెప్పేది.  త్వరలో సంసారం అక్కడే పెడదామని చెప్పి వెళ్లి పత్తా లేకుండా వెళ్లిపోయేది. ఇలా వేరు వేరు ప్రాంతాల్లో తిరుగుతూ అమ్మాయిలను మోసం చేయడం అలవాటు చేసుకుంది. అయితే  మూడో యువతి నిర్మల పెళ్ళి అయిన కొన్నిరోజులకు రమాదేవి మోసాన్ని పసిగట్టి పక్కా ప్రణాళికతో రమాదేవి గుట్టును బైటపెట్టింది.  దీంతో రంగంలోకి దిగిన జమ్మలమడుగు  పోలీసులు విచారణ చేయడంతో రమాదేవి మగవాడి వేషం లో చేసుకున్నపెళ్ళిళ్ళ గురించి బయటపడింది. 

నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జన్యువుల్లో వచ్చిన మార్పులతోనే ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.  అయితే ఈమె ఇలా ఎందుకు ప్రవర్తించిందన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos