మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) ఇవాళ అర్దరాత్రి కన్నుమూశాడు. తీవ్ర జ్వరంతో  హైదరాబాద్‌లోని కేర్  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ (ఫిబ్రవరి 7) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకుని హాస్పిటల్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు, అభిమానుల ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం విషాదంగా మారింది.  

3 నెలల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించు కున్న ఆయనకు, 4 రోజుల క్రితం డెంగ్యూ జ్వరం రావడంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన మల్టీ ఆర్గాన్ పేల్యూర్ వల్ల అర్దరాత్రి మృతిచెందారు. 
 
ముద్దుకృష్ణమ నాయుడు మృతితో టీడీపీ ఒక సీనియర్ నేతను కోల్పోయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన మృతి విషయం తెలిసి  తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలను స్వస్థలం చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం గ్రామం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

కేర్ ఆస్పిటల్ వద్ద విషాద వాతావరణం (వీడియో)