ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్

gajal srinivas arrest
Highlights

  • గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

యువతిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గాయకుడు, గజల్ కళాకారుడు  శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్‌ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు గజల్ శ్రీనివాస్ కు చెందిన ఆలయవాణి అనే వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్నారు. అయితే ఈమెను తరచూ గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించేవాడు. ఈ మద్య అతడి ఆగడాలు ఎక్కువవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి,  ప్రాథమిక దర్యాప్తు జరిపిన వెంటనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.  

ఈ అరెస్టుకు సంభందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

loader