భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో విషాద ఘటన చోటుచేసుకుంది.  ఎండలు మండిపోతుండటంతొ వీటినుండి సేదతీరడానికి  సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చెరువుల మునిగి చనిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన లావుడ్యి సౌజన్, బానోత్ సిద్దు, బానోతు పండు, బానోతు సంతోష్ లు స్నేహితులు. వీరు నలుగురు కలిసి సరదాగా గ్రామ సమీపంలోని సాయం చేరువులో ఈతకు వెళ్లారు. అయితే వీరికి సరిగా ఈత రాదు. అయినప్పటికి చెరువులో ఆడుకుంటూ బాగా లోతులోకి వెళ్లిన నలుగురూ నీళ్లలో మునిగి చనిపోయారు. అయితే  విద్యార్థులు చెరువులో మునిగిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను బైటికి తీశారు. ఈ విద్యార్థుల మృతితో వారి కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చిన్నారుల మృత్యువార్త తెలుసుకున్న పోలీసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం వాటిని సోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.