వరంగల్ అర్బన్ జిల్లా కొత్తపేట లో విషాదం చోటుచేసుకుంది. ఓ చెరువులో సరదాగా ఈత కొట్టడానికి దిగి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కార్తీక వనబోజనం కోసం వచ్చిన ఈ నలుగురు చిన్నారులు చెరువులో దిగారు.అయితే అందులో బాగా బురద ఉండటం వీరు అందులో ఇరుక్కుని చనిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు చిన్నారులను కాపాడే ప్రయత్నం చేసినా కాపాడలేక పోయారు. దీంతో చివరకు మృత దేహాలను స్థానికులు బయటకు తీసారు .
మృతుల వివరాలు
1.రంజాన్ (16 సంవత్సరాలు) 10th క్లాస్
2.నదీమ్ పాషా(16 సంవత్సరాలు)  10 th క్లాస్ 
3.మొమిన్ (14 సంవత్సరాలు) 8th క్లాస్
4.రసూల్ (13 సంవత్సరాలు) 7th క్లాస్