ప్రేమికు ల రోజున ఒ విరహ ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా ఆత్మహత్యకు పాల్పడింది ఎవరో అల్లాటప్పా వ్యక్తి కాదు. తన దేహదారుడ్యంతో కర్ణాటక ప్రజలు మనసులు గెలుచుకున్న మాజీ మిస్టర్‌ కర్ణాటక పురస్కార గ్రహీత. అయితే ఇతడు తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి లేకుండా బ్రతకడం నరకంగా భావించి అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. గుండుల్లోని బాధను  దిగమింగడానికి ఏకంగా గుండెపైనే కత్తితో పొడుచుని  ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రాణాలు బలితీసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నారు.  

బళ్లారి జిల్లా హొసపేటె సమీపంలోని హగరిబొమ్మన హళ్లికి చెందిన  దేహదారుఢ్య క్రీడాకారుడు వీరేశ్‌(26), హొసపేటకు చెందిన ఓ యువతి  కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  దీంతో వీరు ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని భావించారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో వీరేష్ ఈ మద్య తీవ్ర డిప్రెషన్ తో ఉంటున్నాడు.

అయితే నిన్న వాలంటైన్స్ డే కావడంతో ప్రియురాలిని కలవడానికి వీరేష్ హోసపేటకు వెళ్లాడు. ఇతడిని కలవడానికి  వెళుతుందని తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆమెను ఇంట్లోనే నిర్భందించారు. ప్రేయసి కోసం ఎంతసేపు వేచివున్నా ఆమె రాకపోవడంతో వీరేష్ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు వీరేష్. ఇదే డిప్రెషన్ లో కత్తితో తన చాతీలో పొడుచుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు హాస్పత్రికి తరలించినప్పటికి అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. గుండెల్లో కత్తి దిగడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతడు మర ణించాడు.  ఈ ఆత్మహత్యపై పొలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శివారెడ్డి తెలిపారు.