బావిలో పడ్డ అడవి దున్నను ఎలా కాపాడారో చూడండి (వీడియో)

బావిలో పడ్డ అడవి దున్నను ఎలా కాపాడారో చూడండి (వీడియో)

ఏటూరునాగారం, పాకాల రిజర్వు అటవీ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే అడవి దున్నలు వేగంగా అంతరిస్తున్న విషయం తెలిసిందే. వీటిని కాపాడటానికి అటవీ శాఖ  అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా అటవీ ప్రాంతం తగ్గడంతో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్న ఈ దున్నలు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇలాగే ఓ అడవి దున్న ఆత్మకూరు మండలం పెంచికల్ పేట సమీపంలో పంట పొలాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. దీన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల అటవీశాఖ రెస్క్యూ టీమ్ లు అక్కడికి చేరుకున్నాయి. 

క్రేన్ సహాయంతో బావిలో నుండి దున్నను చాకచక్యంగా వెలికితీశారు. ఈ సహాయక చర్యలను చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పీకే ఝా, వరంగల్ చీఫ్ కన్సర్వేటర్ అక్బర్ లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ దున్న బాగా ఎత్తునుండి నీళ్లు లేని బావిలో పడటంతో తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో చికిత్స కోసం హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ కు తరలించారు. 

  అడవి దున్నను బావిలోంచి ఎలా తీస్తున్నారో కింది వీడియోలో చూడండి

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos