మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా పల్లేడ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మహిళా దళ సభ్యులు హతమయ్యారు. వీరితో పాటు మరో ఇద్దరు పురుష మావోయిస్టులు కూడా పోలీసుల తూటాలకు బలయ్యారు.

   
మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు గడ్చిరోలి సమీపంలో మావోల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక పోలీస్ బలగాలు రగంలోకి దిగి మావోల శిబిరంపై కాల్పులకు దిగారు. అనుకోని ఈ సంఘటనతో కంగుతిన్న మావోలో తేరుకుని ఎదురుకాల్పులకు దిగారు. అయితే పోలీసులు బారీ సంఖ్యలో వీరికి చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఏడుగురు మావోలు హతమయ్యారు.
ప్సస్తుతానికి కాల్పులు ఆగినా ఇంకా ఎవరైనా తప్పించుకున్నారేమోనన్న అనుమానంతో పోలీసులు అడవిని జల్లెడపడుతున్నారు. ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సంఘటనా స్థలంలో మావోయిస్టుల నుంచి భారీ సంఖ్యలో మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 
 ఇంకా ఈ ఎన్ కౌంటర్ గురించి  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.