Asianet News TeluguAsianet News Telugu

కొత్త పేరెంట్స్ కి... కొన్నిఇన్వెస్ట్ మెంటు సలహాలు

  • ఎందులో పెట్టుబడులు పెట్టాలి
  • మ్యూచివల్ ఫండ్స్
  • బంగారంపై పెట్టుబడులు
  • రియల్ ఎస్టేట్స్
five investment ideas for new parents

కొత్తగా తల్లిదండ్రులైన వారికి చాలా సంతోషంగా ఉంటుంది. పాపాయి పుట్టిన దగ్గర నుంచి ఏ పేరు పెట్టాలి... ఎలాంటి దుస్తులు కొనాలి.. ఏలాంటి ఆహారాన్ని అందించాలంటూ ముందుగానే ఆలోచిస్తుంటారు. వారికి మంచి భవిష్యత్తు అందించడానికి చాలానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మరి వారి పేరు మీద ఎలాంటి సేవింగ్స్ చేస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం ఎలాంటి 
పెట్టుబడులు పెడుతున్నారు. ?ఎందులో పెట్టుబడులు పెడితే  వారి భవిష్యత్తు  బంగారుమయం అవుతుంది.. ?అసలు పిల్లలు చిన్న వియసులో ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టడం 
అవసరమా..?  

పిల్లలు అతి చిన్న వయసులో ఉన్నప్పుడే వారి పేరు మీద పెట్టుబడులు పెట్టడం అవసరమా అంటే అవసరమే. ఉదాహరణకు ప్రస్తుతం ఓ వ్యక్తి ఎంబీఏ విద్యను పూర్తి చేయాలంటే 10 నుంచి 
15 లక్షల రూపాయల వరకు ఫీజ్ చెల్లించాల్సి వస్తోంది. మరో 15 సంవత్సరాల తర్వాత అదే ఎంబీఏ విద్యకు అయ్యే ఫీజు రూ.30లక్షల వరకు కావచ్చు. ఇది కేవలం ఫీజు మాత్రమే. పుస్తకాలకు, 
ఇతర ఖర్చులకు మరింత ఎక్కువే అవుతుంది.  మనం ఇప్పటి నుంచే వారికంటూ సేవింగ్స్ చేయడం అవసరం. అయితే ఎలాంటి సేవింగ్స్ చేయాలో  మనం ఇప్పుడు తెలుసుకుందాం

1. మ్యూచివల్ ఫండ్స్
పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మ్యూచివల్ ఫండ్స్ సరైన ఎంపిక. అయితే ఇందులో మూడు రకాల మ్యూచివల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇవి 
కొంచెం రిస్క్ తో కూడుకున్నవి. ఎందుకంటే వీటిని స్టాక్ మార్కెట్ లో పెట్టాల్సి ఉంటుంది. రెండోది బ్యాలెన్స్  డ్  మ్యూచువల్ ఫండ్స్. ఇవి కూడా కొంచెం రిస్క్ తో కూడుకున్నవే. ఈ 
రెండింటితో పోలిస్తే డెబ్ట్ ఫండ్స్ కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. పిల్లల ఉన్నత విద్య కోసం సేవింగ్స్ చేయాలనుకునే వారు  వీటిని ఎంచుకోవచ్చు. దీని ద్వారా భవిష్యత్తు బాగుంటుంది.

2. రియల్ ఎస్టేట్స్
దేశ  జనాభా నానాటికీ పెరిగిపోతోంది. జనాభా పెరిగిన కొద్దీ భూ విలువ కూడా పెరిగిపోతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడులు పెట్టడం కూడా చాల యోగదాయకం. పెద్ద పెద్ద పట్టణాల్లో 
భూమి కొనడం కష్టమైన వారు కొంచం చిన్న పట్టణాల్లో భూమిని కొనుగోలు చేస్తే  కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భూ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. 

3.బంగారంపై పెట్టుబడులు
మన దేశంలో  బంగారం కొనకుండ పెళ్లిలు జరగడం అరుదు.  దీని విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. భవిష్యత్తులో బంగారం విలువ  పెరిగితే అప్పడు దానిని కొనే స్థితిలో మనం 
ఉండకపోవచ్చు. అందుకే గోల్డ్ ఈపీఎఫ్, గోల్డ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం కూడా ఉత్తమం.

4.ఇన్ సూరెన్స్ ప్లాన్
మ్యూచువల్ ఫండ్స్, భూమి, బంగారం వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టినా పెట్టకపోయినా.. ఒక మంచి ఇన్ సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మాత్రం తప్పనిసరి. మీరు ఉన్నా లేకపోయినా ఇది మీ 
కుటుంబాన్ని ఆదుకుంటుంది. అంతేకాదు పిల్లల పేరు మీద చాలా కంపెనీలు ఇన్ సూరెన్స్ ప్లాన్ లు ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో మంచిది చూసుకొని మీరు ఎంచుకోవచ్చు. అంతేకాకుండా మీ 
పిల్లల పేరు మీద  ఒక సేవింగ్ బ్యాంక్ ఖాతా తెరిచి.. అందులో మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని జమ చేయండి. అలా చేయడం వల్ల వారికి  ఆ మొత్తం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. 

తెలిసిందిగా మీ పిల్లల భవిష్యత్తు ఎలా బంగారు మయం చేసుకోవాలో..ఇంకెందుకు ఆలస్యం ఆచరణలో పెట్టేయండి.

*అధిల్ షెట్టి, బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

Follow Us:
Download App:
  • android
  • ios