ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా మారిండని టిఆర్ ఎస్ లో గుసగుస. ఇంత కాలం పార్టీ ఎమ్మెల్యేలకు సమయమివ్వని  ముఖ్యమంత్రి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అయి ఎన్నికల ముచ్చట పెడుతున్నారని తెలిసింది. పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను ఇలా ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇంతవరకు బహిరంగంగా కెసిఆర్  ఎవరికి ఒంటరిగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అసలు చాలా గొడవలక్కడే మొదలయ్యాయి. ఆయన ఇన్వెస్టర్లకు, సినిమావాళ్లకు తప్ప ఎవరికీ తనని కలిసే అవకాశం ఇవ్వలేదు. తాజాగా  జనసేన యజమాని పవన్ కు అప్పాయంట్ మెంట్ ఇవ్వడం పెద్దగొడవ సృష్టించింది.

తనకు అప్పాయంట్ మెంట్ ఇవ్వలేదన్నది జెఎసి ఛెయిర్మన్ కోదండ్ రామ్ వోపెన్ గా ఎన్నో సార్లు చెప్పారు. ఇక కాంగ్రెస్ నేతలకు కూడా ఆయన అప్పాయంట్మెంట్ ఇవ్వనే లేదట. వీళ్లకివ్వకుండా పవన్ కల్యాణ్ కు ఎలా ఇస్తారని చాలా మంది ప్రతిపక్ష పార్టీ వాళ్లు గొడవచేశారు. 

 15 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జేఏసి ఛైర్మెన్ కోదండరాం తో టచ్ లో ఉన్నారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. వారు ఏ క్షణంలో అయినా గోడ దుకుతారని టిఆర్ఎస్ లో ఆందోళన ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.  

ఇక ఎమ్మెల్యేలు బయటకు చెప్పుకోలేదుగాని, వాళ్లలో ఎవ్వరూ ‘నాకు సిఎం అప్పాయంట్ మెంట్ దొరికింది’అని గొప్పగా చెప్పుకున్న వాళ్లు లేరు. ఇది గతం. ఇపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడాలనుకుంటున్నారు.  జిల్లాలవారిగానే కాదు, ముఖాముఖి కూడా వాళ్లతో చాయ్ బిస్కెట్లు ఇచ్చి మాట్లాడాలనుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయన నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన కొందురు ఎమ్మెల్యేలతో ప్రేమగా మాట్లాడినట్లు తెలిసింది. దీనితో గుడ్ విల్ బాగా జనరేట్ కావడంతో మిగతా అన్నిజిల్లాల ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాలని ఉబలాటపడుతున్నారని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలోనే కేసీఆర్ చాయ్ బిస్కెట్ ప్రోగ్రాం షురూ చేసినట్లు చెబుతున్నారు.

దేశంలో ముందుస్తు  ఎన్నికల చర్చ మొదలవుతూ ఉండటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీలో పొలిటికల్ చర్చలు మొదలుపెట్టారని టిఆర్ఎస్ కు చెందిన ఒక పెద్ద మనిషి ఏషియానెట్ తో చెప్పారు.

‘ఇంతవరకు ఎమ్మెల్యేల పనితీరు అంటే అంతా సర్వేల ద్వారా జరిగింది. ఎవరు సర్వే చేశారు, ఎపుడు చేశారనేది గోప్యంగా ఉంచారు. ఇపుడు మొట్టమొదటి సారిగా ఆయన ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడటం షురూ చేసిండని,’ ఆయన చెప్పారు.

తాను చేయంచిన సర్వే రిపోర్టులతో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యేలతో చర్చించాలనుకుంటున్నారని తెలిసింది. 

అధికారం చేపట్టినప్పటినుంచీ కేసీఆర్ పాలనపైనే దృష్టి సారించారు. తెలంగాణ మీద పడిన పాతమరకలను చెరిపేసి తన సంతకం మాత్రమే కనిపించే విధంగ ఆయన పాలన రూపొందించుకుంటూ వచ్చారు. అందుకే చిల్లర రాజకీయ చర్చలకు తావీయలేదని ఆయన అభిమాని అయిన ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. అందుకే ఆయన ఎమ్మెల్యే,ఎంపిలకు ముఖాముఖిగా కలిసే అవకాశమీయలేదు. ఇపుడు పార్టీ పనితీరు, ఎమ్మెల్యేల గుడ్ విల్ ఎలా వుందని వారినే అడుగి అసెస్ చేస్తున్నారట. 

నిరంతర వారిని ఉచిత విద్యుత్ పై రైతులు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రభుత్వ లబ్దిదారులతో కలుస్తున్నారా, నియోజకవర్గానికి  ఏమయిన పనులు అవసరమా ఇలా వాకబు చేస్తున్నారట. 

ఇలా సంప్రదించాక తనకు సంతృప్తి లేకపోతే, వచ్చే ఎన్నికల్లో సిటింగ్ అయినా టికెట్ గల్లంతవుతుందని కొంతమంది ఎమ్మెల్యేలు ఆందోళన కూడా  చెందుతున్నారు.