హైదరాబాద్  హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం, ఎల్ & టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో ఇటీవలే కొన్ని మార్గాల్లో పట్టాలెక్కిన విషయం తెలిసిందే. అయితే హైటెక్ సిటీ ప్రాంతంలో ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ సమయంలో ఇలా అగ్ని ప్రమాదం జరగడంతో మెట్రో స్టేషన్లలో భద్రతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో పోలీసులు ట్నాఫిక్ ను అదుపు చేసారు. అయితే ఈ ప్రనమాదంలో ెలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అయితే ఈ అగ్ని  ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీని కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు  తెలియాల్సి ఉంది.

అగ్ని ప్రమాద వీడియో