రవీంద్ర భారతిలో అగ్ని ప్రమాదంప్రధాన వేదిక వద్ద చెలరేగిన మంటలుభారీగా ఆస్తి నష్టం 

హైదరాబాద్ లోని సాంస్కృతిక వేదిక రవింద్రభారతి లో అగ్ని ప్రమాదం సంభవించింది. రవీంద్ర భారతి లోని ప్రధాన వేదిక వద్ద విద్యుదాఘాతం సంభవించి వైర్లు, లైటింగ్ సెట్లు, స్పీకర్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగానే జరిగినట్లు సమాచారం. ఈ మంటల వల్ల రవీంద్ర భారతి పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి షాట్ సర్యూటే కారణమై ఉంటుందని తెలుస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred