తమ పిల్లలను ఎవరూనా కొడితే తట్టుకోలేక వారిపై గొడవకు దిగే తల్లిదండ్రలను చూశాం. స్కూళ్లో తోటి పిల్లలు తమ చిన్నారితో గొడవపడితే తట్టుకోలేక స్కూల్లో కంప్లైట్ చేసే తల్లిదండ్రులను చూసుంటాం. పిల్లాడికి చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతుంటారు సేరెంట్స్. అలాంటిది కన్న కొడుకు స్కూల్ కి వెళ్లనని మారాం చేసినందుకు ఓ కసాయి తల్లిదండ్రులు గొడ్డును బాదినట్లు బాదిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కౌకూర్‌ భరత్‌నగర్‌ లో ప్రహ్లాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడి కొడుకు శివమణి(14) స్థానిక పాఘశాలలో చదువుతున్నాడు. అయితే ఈ బాలుడు నిన్న స్కూల్ కి వెళ్లలని మారాం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి పిల్లాడిపై రెచ్చిపోయి చేతికి ఏది దొరికితే దాంతో కొట్టాడు. దీంతో పిల్లాడి పెదవిపగలడంతో పాటు, శరీరంపై వాతలు పడ్డాయి.  ఇంతలా దెబ్బలు తగిలిన కొడుకును తల్లి కూడా ఏమాత్రం పట్టించుకోలేదు.  

శరీరమంతా కమిలిన గాయాలతో బాలుడు ఏడుస్తుండటంతో స్థానికులు చలించిపోయారు. పిల్లాడి బాధను చూడలేక జవహార్ పగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.  బాలుడి తండ్రి ప్రహ్లాద్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.