వెలగపూడి సచివాలయం వద్ద ఉద్రిక్తత (వీడియో)

వెలగపూడి సచివాలయం వద్ద ఉద్రిక్తత (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి వెలగపూడి సచివాలయం వద్ద అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బలవంతంగా తన అనుమతి లేకుండా భూమిని లాక్కుని అందులోనుంచి రోడ్డు వేస్తున్నారంటూ ఓ రైతు పనులను అడ్డుకున్నాడు. ఈ పనులు ఆపకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అధికారులకు హెచ్చరించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి వేల ఎకరాల భూములు సేకరించిన విషయం తెలిసిందే. అయితే రాజధాని మౌళిక వసతుల కోసం సీఆర్ డీఎ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. 

అయితే అధికారులు అనుమతి లేకుండా తన పొలంలో రోడ్డు నిర్మానం చేపడుతుండుతున్నారంటూ గద్దె మీరా ప్రసాద్ అనే రైతు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అర్థరాత్రి కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన రోడ్డెలా వేస్తారని అధికారులతో దాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు తుళ్లూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు మీరా ప్రసాద్ ను అక్కడి నుండి తరలించారు. పోలీసులకు,రైతుకు మధ్య జరిగిన పెనుగులాటలో రైతు చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. ఇలా అర్థనగ్నంగానే మీరా ప్రసాద్ కొద్దిసేపు నిరసన చేశారు. తనకు అన్యాయం చేసి తన భూమిని లాక్కుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఈ బాధిత రైతు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

వీడియో

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Home Page

Next page