మంచిర్యాల జిల్లా కాశిపేట్ మండలంలో దారునం జరిగింది. భార్యా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఓ వ్యక్తి వారిని విషమిచ్చి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళితే చొప్పరిపల్లె గ్రామానికి చెందిన తిరుపతికి భూదేవితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కీర్తన, శషాంక్ ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో తిరుపతి కుటుంబం ఎంతో హ్యాపీగా ఉండేది. అయితే ఏమైందో ఏమో గాని ఇతడు తన భార్యా పిల్లలకు విషం పెట్టి  తానూ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్యా పిల్లలకు అన్నంలో విషం కలిపి ఇచ్చిన తిరుపతి ఆ తర్వాత తాను కూడా అదే  విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భార్యా, భర్తలు తిరుపతి,భూదేవి చనిపోగా పిల్లలు కీర్తన, శషాంక్ ల పరిస్థితి విషమంగా ఉంది. వీరు ప్రస్తుతం మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ఈ ఆత్మహత్యలకు గల కారనాలు తెలియాల్సి ఉంది.