ఫలక్ నుమా ప్యాలస్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విందులో కల కలం సృష్టంచేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. అంతర్జాతీయ అతిథి ఇవాంక, ప్రధాని మోదీతో పాటు అత్యంత ప్రముఖులు పాల్గొన్న విందు జరిగే ఫలక్ నుమా ప్యాలస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు ఆగంతకులు డీజీపీ క్యాంప్ ఆపీస్ లోని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి ఫలక్ నుమా ప్యాలస్ లో బాంబు పెట్టినట్లు తెలిపారు. అయితే ఈ ఫోన్ కాల్ అంత విశ్వసించదగినది కాకపోవడం, అప్పటికే విందు ప్రారంభం కావడంతో పోలీసులు ఈ విశయాన్ని గోప్యంగా ఉంచారు. 
అయితే ఈ ఆకతాయి ఫోన్ కాల్ ను మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రాత్రంతా పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబు లేదని కన్ పర్మ్ చేసుకుని ఊపిరిపీల్చుకున్నారు.
ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ని గుర్తించే పని లో పోలీసులు ఇప్పుడు నిమగ్నమయ్యారు. ఓల్డ్ సిటీ నుంచి ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా ఈ బెదిరింపు ఫోన్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం పోలీసులపై సీరియస్ అయ్యింది. ఫలక్ నుమా పీఎస్ లో కేసు నమోదు చేసి ప్రముఖులు పాల్గొన్న విందులో కలకలం సృష్టించాలనుకున్న దుండగులను పట్టుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.