ఆర్యభట్ట రూపకల్పనలో ఆయన  కీలక పాత్ర 1976లో పద్మభూషణ్‌, 2017లో పద్మవిభూషణ్‌

 ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఉడిపి రామచంద్రారావు(యు.ఆర్‌.రావు(85)) ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

భారత తొలి వాహక నౌక ఆర్యభట్ట రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.

పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఇన్‌శాట్‌ వాహక నౌకల అభివృద్ధిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు.

ఇస్రో ఛైర్మన్‌గా పనిచేసిన యు.ఆర్‌.రావు 1976లో పద్మభూషణ్‌, 2017లో పద్మవిభూషణ్‌ అందుకున్నారు.

బెంగళూరు, అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబోరేటరీ పాలకమండలి ఛైర్మన్‌గా, తిరువనంతపురంలోని

ఐఐఎస్‌టీ ఛాన్స్‌లర్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఆయన చేసిన సేవలకు గాను నాసా,

రష్యా సహా పలు దేశాల నుంచి అవార్డులు అందుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

యు.ఆర్.రావు దేశానికి చేసిన సేవలు మరువలేమని మోదీ కొనియాడారు.